చిన్నప్పుడు మా నాన్నగారు సైకిలు మీద మా అన్నయ్యని పాఠశాలకి తీసుకువెళ్తుంటె , మా అన్నయ్య తెలుగు పుస్తకం మీద చదివినట్టు గుర్తు .
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా,
ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా,
ఫొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము.
నన్ను చూసి నా దేశాన్ని మెచ్చుకునేంతగా నేను ప్రవర్తించానొ లేదొ తెలీదు, కాని నేను ప్రవర్తించిన తీరు నా దేశం విలువలను తగ్గించలేదన్న ఆత్మానందం మిగిల్తె చాలు.
వివేకానందుడు పాశ్చాత్య దేశాల పర్యాటన ముగించుకుని భరతభూమిలొ అడుగు పెట్టిన వెంటనె, గట్టిగా గాలి పీల్చి కిందపది దొర్లాడుట, కన్యాకుమారి ఇసుకలొ. ఆయనంతలా నేను నా ఆనందాన్ని ప్రకటించలేకపొవచ్చు కాని మాత్రుభూమిలొ అడుగుపెడుతున్న ఆ అనందంలొ ఏ మాత్రం తేడా లేదు.
ఆమ్మ కలిపి నోట్లొపెట్టే పప్పన్నం ఆవకాయ ముద్ద,
మడిగట్టుకున్నప్పుడు ముట్టుకుంటె తిట్టే తిట్లు,
ఆమ్మని ఎత్తుకుని తిప్పుతున్నప్పుడు నాన్న నవ్వులు,
డబ్బు విలువ తెలుసుకొమ్మని అన్నయ్య మందలింపులు,
కళ్ళు కనిపించకపొయినా డాక్తరుకి భయపడి చెప్పని నాన్నమ్మ
దేవుడు దిగి వచ్చినా దినచర్య మార్చని తాతయ్య.
"ఉన్న ఊరే నాకు చెన్నపట్నమ్ము కన్న తల్లే నాకు కల్పవ్రుక్షమ్ము" అన్న నార్ల వెంకటెశ్వర రావు గారి మాటలు ఎంత నిజం.
సంక్రాంతికి ఇంటింటికి వచ్చె గరగ, గంగిరెద్దుల మేళం ,
డబ్బుల కొసం వాడు చెప్పె "గందరగోళ జాతకం"
పొద్దున్నే పెట్టె భోగి మంట.
వీధంతా పెట్టె రంగు రంగుల ముగ్గులు, మధ్యలో ఉండె గొబ్బెమ్మలు,
కనుమనాడు జరిగే జాతర,
రాత్రంతా జరిగే వీరుళ్ళమ్మ(గ్రామదేవత) ఊరేగింపు.....
"దూరమైపోయేంత వరకు తెలీదు మన దగ్గర వాళ్ళ విలువ, మన సంప్రదాయాల గొప్పతనం"
పండగనాడు పెట్రెగిపొయె పిల్లమేళం,
అన్నయ్యలు,బావలు, వదిన, మరదళ్ళు, అక్కలు,
ఆప్యాయంగా ఇబ్బంది పెట్టె మావయ్యలు,అత్తయ్యలు, పెదనాన్న, దొడ్డమ్మ(మూడు చోట్ల భోజనం చెయ్యాలంటె కష్టం కాదా?) ,
అందరం సరదాగా రాజమండ్రికి వెళ్ళి చూసే పండగ సినిమా,
"ఆనందం వచ్చినప్పుడు పంచుకోవడానికి, కష్టం వచ్చినప్పుడు సర్ది చెప్పడానికి నలుగురు లేని జీవితం ఒక జీవితమా?"
పెట్టిన వెంటనే మాయమయ్యె రేగొడియాలు,
నూనె రాసి,నలుగుపెట్టి, కుంకుడు రసంతొ స్నానం చెయిస్తానని అమ్మ,
పొద్దున్నే ఇదేంగోలరా అని పరిగెత్తె నేను ,
ఇల్లంతా పెట్టె పరుగులు, ఊరంతా వినిపించే కేకలు,
రారా దున్నపోతు వెధవ అని అమ్మ అరుపులు , నూనె వల్లుపై వేసే దెబ్బలు(చెడ్డీ తో నేను వేసె చిందులు, హహహ),
"అంతటా సాధ్యమా ఆ దేవుని ఉనికి అందుకే ఇచ్చాడు అమ్మని మనకి"
అమ్మాయిల అందానికి అర్థం చెప్పె పట్టు పరికిణీలు, చీరలు,
భారతీయ స్త్రీ కి మాత్రమె అర్థమయ్యె ప్రెమలు, విలువలు.
అర్థం కాకపోయిన అర్థవంతమయిన సంప్రదాయలు,
కాలగర్భంలో కలిసిపోతున్న భారతీయ గురుతులు,
"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి"
మాత్రుభూమి, మాత్రు భాష , మాత్రు మూర్తి
వస్తున్నా........
2 comments:
Nice post....I was not fortunate enough to spend much time in the villages because of my upbringing in the cities. But, I like the the environment very much...and I can imagine whatever you wrote. I wish I was born in a joint family in a village...
dude, u have no idea.....
my sister in columbus used to carry me around when I was a kid and now I am carrying her kid...
Post a Comment